తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 22 శాతం పెరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. 2023తో పోల్చుకుంటే 2024లో మొత్తం 1,69,477 క్రైమ్ కేసులు నమోదయ్యాయంటూ నివేదిక విడుదల చేసారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేటు 43.33 శాతం ఎక్కువైనట్లు వెల్లడించారు.
కేవలం 2024 లోనే 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు. రాష్ట్రంలో హత్య, అత్యాచారం, చీటింగ్, దోపిడీ వంటి కేసులు పెరినట్లు డీజీపీ తెలిపారు.