– కాంగ్రెస్ నేత కొలన్ హన్మంత్ రెడ్డి
ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కండ్లకోయ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కోరారు. అనంతరం శనివారం మేడ్చల్ కండ్లకోయలో నూతనంగా నిర్మించబోతున్న ఐటీ పార్క్ శంకుస్థాపన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నందున ప్రజలు భారీగా రావాలని సూచించారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విచేయుచున్న భారీ బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.