Homeహైదరాబాద్latest Newsఏడుస్తున్నారంటూ..! 'పుష్ప 2' మూవీ టికెట్‌ ధరలపై ఆర్జీవీ సంచలన ట్వీట్‌

ఏడుస్తున్నారంటూ..! ‘పుష్ప 2’ మూవీ టికెట్‌ ధరలపై ఆర్జీవీ సంచలన ట్వీట్‌

‘పుష్ప-2’ మూవీ టికెట్‌ ధరల పెంపుపై ఆర్జీవీ సంచలన ట్వీట్‌ చేసారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్‌ బట్టలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్లు.. సినిమా టికెట్‌ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ రాంగోపాల్‌ వర్మ అన్నారు. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ? అని ఆర్జీవీ ప్రశ్నించారు. అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి ‘పుష్ప 2’ సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే.అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా? అని ఆర్జీవీ అన్నారు.

Recent

- Advertisment -spot_img