CSK : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అయితే 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్ మెన్స్ లో విజయ్ శంకర్ 68, ధోని 30, శివం దుబే 18, డెవాన్ కాన్వే 13 పరుగులు చేసారు. మిగతా బ్యాటర్లు అంత నిరాశపరిచారు.
ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాట్‌మెన్స్ కెఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33, అక్షర్ 21, సమీర్ రిజ్వి 20, ట్రిస్టన్ స్టబ్స్ 24 పరుగులు చేసారు.