IPL : ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూనే ధోనీ మ్యాచ్ ఆడినట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం ధోనీ కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూంకు వెళ్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై CSK బౌలింగ్ కన్సల్టెంట్ సిమ్మన్స్ స్పష్టతనిచ్చాడు. ‘నొప్పిని భరిస్తూనే మ్యాచ్ ఆడాడు. ఆ సామర్ధ్యం అతనికి ఉంది. నేను చూసిన హార్డ్ వర్కర్లలో ధోనీ ఒకడు. మహీ గాయం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించాడు. కాగా MI తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 3 సిక్సర్లు బాది టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ నెక్స్ట్ మ్యాచ్‌ను ఏప్రిల్ 19న ఆతిథ్య జట్టు లక్నోతో ఆడనుంది.