Homeహైదరాబాద్latest NewsCSK - RCB : చెన్నై వెనుక్కి.. ఆర్సీబీ ముందుకు

CSK – RCB : చెన్నై వెనుక్కి.. ఆర్సీబీ ముందుకు

CSK – RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB ), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండు జట్టులు ఐపిఎల్ లోనే అతిపెద్ద అభిమానుల ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీలు. ఈ రెండు జట్లు ఎక్కడ ఆడినా స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే తాజాగా ఆర్సీబీ ముందుకు వెళ్లి చెన్నై ను వెనుక్కినెట్టింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న చెన్నై జట్టును బెంగళూరును అధిగమించింది. మొత్తం 17.8 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానానికి ఆర్‌సీబీ దూసుకుపోయింది. ఇప్పటివరకు 17.7 మిలియన్ల మంది ఫాలోవర్లతో చెన్నై మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. 16.2 మిలియన్ల మంది ఫాలోవర్లతో ముంబై ఇండియన్స్ (MI) మూడో స్థానంలో కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img