Homeస్పోర్ట్స్రూ.11 కోట్లను రైనా కోల్పోయినట్టేనా?

రూ.11 కోట్లను రైనా కోల్పోయినట్టేనా?

చెన్నై: ఐపీఎల్​ 20లో చెన్నై సూపర్​ కింగ్స్ ఆపసోపాలు పడుతుంది. ఆ జట్టులో సురేశ్​ రైనా లాంటి స్టార్​ ఆటడాడు ఆడకపోవడం ఆ జట్టుకు కొంత లోటుగానే భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే ఇండియాకు తిరిగొచ్చిన రైనా ఐపీఎల్​లో దాదాపుగా ఆడటనట్టేనని అందరూ భావిస్తున్నారు. అయితే ఇందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని జట్టు యజమాని ఎన్​.శ్రీనివాసన్​ హెచ్చరించారు. కొందరు ఆటగాళ్లకు విజయం నెత్తికి ఎక్కిదంటూ ఎత్తిపొడిచాడు. జట్టుకు సమర్థుడైనా కెప్టెన్​ ధోనితోపాటు అనేకమంది వర్ధమాన ఆటగాళ్లు ఉన్నారని శ్రీనివాసన్​ అన్నారు. సీఎస్​కేలో కొందరు ఆటగాళ్ల వ్యవహార శైలిపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ఈ వ్యాఖ్యల తెలుస్తోంది. ఇదిలా ఉండగా దుబాయిలో తనకు కేటాయించిన హోటల్​ గది నచ్చకపోవడంతోనే రైనా మేనేజ్​మెంట్​పై అలిగి ఇండియాకు వచ్చినట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో హల్​చల్​ చేయడం గమనార్హం. ఇప్పటికే సీఎస్​కే టీంలో 13 మందికి కరోనా పాజిటివ్​ రావడం వారంతా క్వారంటైన్​లో ఉండటం సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్​లో టీం ఎలా రాణిస్తుందోనని సీఎస్​కే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img