చెన్నై: మిస్టర్ ఐపీఎల్గా పిల్చుకునే సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్‌కు దూరం కానున్నాడా? ఇకపై చెన్నై టీమ్‌లో సురేష్ రైనా మెరుపులను చూడలేమా? సురేష్ రైనాతో తెగదెంపులు చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.
ఈ మేరకు కొన్ని నేషనల్ స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
తిరిగి రావడమే కొంపముంచిదా..
సురేష్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను ఆడటానికి టీమ్‌తో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాకా వెళ్లాడు.
వ్యక్తిగత కారణాలతో అర్ధాంతరంగా తిరిగొచ్చాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అదే విషయాన్ని పైకి ధృవీకరించినా లోపల మాత్రం ఏదో మతలబు ఉందని భావిస్తుంది.
రెడీగా ఉన్నా.. పట్టించుకోలేదు
ఈ కారణంగానే సురేష్ రైనాతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ తెగదెంపులు చేసుకునే స్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తాను జట్టుతో కలవడానికి రెడీగా ఉన్నాననే సంకేతాలు ఇటీవల పంపించినప్పటికీ.. టీమ్ మేనేజ్‌మెంట్ దాన్ని పరిశీలనలోకి తీసుకోలేదు.
పైగా- అతని వ్యక్తిగత కారణాలను తాము గౌరవిస్తున్నామంటూ టీమ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ సైతం సన్నాయి నొక్కులు నొక్కారు. చివరకు సురేష్ రైనాను జట్టులోకి తీసుకునే అవకాశం లేదనీ తేల్చి చెప్పారు.
వెబ్‌సైట్ నుంచి ఔట్.. త్వరలోనే కాంట్రాక్టు రద్దు
సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లతో తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకునే దిశగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వారిద్దరి పేర్లను తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించారు. త్వరలోనే కాంట్రాక్టు రద్దు చేసి చెన్నై టీం నుంచి రిలీవ్ చేసేందుకు న్యాయ పరమైన ప్రక్రియను మేనేజ్‌మెంట్ ప్రారంభించింది.