CSK vs LSG : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు ఎకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎందుకుంది. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేయనుంది. చెన్నై వరుసగా ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న చెన్నై జట్టుకి విజయం కీలకంగా మారింది.
చెన్నై జట్టులో షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా ఉన్నారు.
లక్నో జట్టులో ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(w/c), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ ఉన్నారు.