Homeహైదరాబాద్latest NewsCSK VS RCB: నేడు మరో రసవత్తర పోరు.. ధోని vs కోహ్లీ.. ఎవరు గెలుస్తారో..?

CSK VS RCB: నేడు మరో రసవత్తర పోరు.. ధోని vs కోహ్లీ.. ఎవరు గెలుస్తారో..?

CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా మరో రసవత్తర పోరాటాలకు వేదిక సిద్ధమైంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ 18వ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించిన ఇరు జట్లు నేడు తమ రెండో విజయం కోసం పోటీ పడనున్నాయి. స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఈ పిచ్ కారణంగా, ఆర్‌సిబి బ్యాటర్లకు స్పిన్నర్ సుర్ అహ్మద్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఆర్‌సిబి పేసర్ భువనేశ్వర్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్ ఇప్పటికే CSK, RCB విజయాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, చెన్నై vs బెంగళూరు ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. వాటిలో చెన్నై అత్యధికంగా గెలిచింది. వారు 21 మ్యాచ్‌ల్లో బెంగళూరు ని ఓడించారు. చెన్నైపై బెంగళూరు 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. అందుకే అభిమానులు మరింత ఉత్కంఠతో ధోని vs కోహ్లీ మ్యాచు కోసం ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img