Homeఫ్లాష్ ఫ్లాష్CSK vs RCB: సీఎస్‌కే చాలా ఈజీ.. కానీ ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

CSK vs RCB: సీఎస్‌కే చాలా ఈజీ.. కానీ ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

IPL-2024 లీగ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి దశకు చేరుకున్నాయి. మిగిలిన బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో CSK గెలిస్తే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి నెట్ రన్ రేట్ కీలకం. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 200 టార్గెట్ ఇస్తే.. సీఎస్‌కేను 182 రన్స్‌కే కట్టడి చేయాలి. ఒకవేళ వర్షం వల్ల ఓవర్లు కుదిస్తే 10ఓవర్లలో 130 రన్స్ చేసి సీఎస్‌కేని 112 పరుగులకు ఆలౌట్ చేయాలి. ఆర్సీబీ ఛేజింగ్ చేస్తే 201 రన్స్ టార్గెట్‌ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. ఒకవేళ 10 ఓవర్లలో 131 టార్గెట్‌ని ఛేదించాల్సి వస్తే 8.1 ఓవర్లలో పూర్తిచేస్తే బెంగళూరు ప్లే ఆఫ్స్‌కి వెళ్లే ఛాన్సుంది.

Recent

- Advertisment -spot_img