CSK VS RCB : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టే దిశగా చూస్తున్నాడు. CSK పై అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ ఈరోజు 55 పరుగులు చేస్తే T20 క్రికెట్‌లో 13,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 5వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 14,562 పరుగులతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
CSK పై విరాట్ కోహ్లీ 32 ఇన్నింగ్స్‌లలో 9 అర్ధ సెంచరీలతో సహా 1,053 పరుగులు చేశాడు. ఈరోజు మ్యాచ్ లో అతను 5 పరుగులు చేస్తే, చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుత రికార్డు శిఖర్ ధావన్ (1,057) పేరిట ఉంది.ఓపెనర్‌గా 5,000 టీ20 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి ఇంకా 38 పరుగులు అవసరం. ఈ మైలురాయిని చేరుకుంటే అతను T20 చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.
కోహ్లీ 9 బౌండరీలు కొడితే, ఆసియాలో ఆడే టీ20ల్లో 1,000 బౌండరీలు కొట్టిన ఘనతను పూర్తి చేస్తాడు. KKRతో జరిగిన RCB తొలి మ్యాచ్‌లో అతను నాలుగు బౌండరీలు కొట్టాడు. కోహ్లీ ప్రస్తుతం 991* బౌండరీలు సాధించాడు.ఆసియాలో ఆడే టీ20ల్లో 150 క్యాచ్‌ల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి ప్రస్తుతం నాలుగు క్యాచ్‌లు అవసరం. ఒకే మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించడం కష్టమే అయినప్పటికీ, రాబోయే మ్యాచ్‌లలో కోహ్లీ ఈ ఘనతను సాధించగలడు.