Chennai : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు ఈ నెల 4న నోటీసులు జారీ చేశారు. లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 న సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ఓ భారతీయుడి నుంచి రూ.1.73 కోట్ల విలువైన లగ్జరీ వాచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టోకరెన్సీ, హవాలా లావాదేవీలు చేసి నవీన్ కుమార్ అనే మధ్యవర్తి ద్వారా హర్షరెడ్డి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను డెంగ్యూ జ్వరంతో అనారోగ్యంగా ఉన్నానని, ఈ నెల 27 తర్వాత హాజరవుతానని కస్టమ్స్ అధికారులకు హర్షరెడ్డి లేఖ రాశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.