ఢిల్లీలో మరో సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. రోహిణి ప్రాంతానికి చెందిన 70ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్‌ని సైబర్ నేరగాళ్లు 8గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ అధికారులమంటూ ఫోన్‌చేసి, ఆయన పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చిందంటూ బెదిరింపులకు దిగారు. సహాయం చేస్తామంటూ నమ్మించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. రూ. 10 కోట్ల 30లక్షల నగదును కాజేసి కాల్ కట్ చేశారు.