Homeహైదరాబాద్latest Newsసైబర్‌ నేరాలు.. 35 వేలకు పైగా ఫిర్యాదులు.. రూ. 633 కోట్లు మాయం..!

సైబర్‌ నేరాలు.. 35 వేలకు పైగా ఫిర్యాదులు.. రూ. 633 కోట్లు మాయం..!

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ మోసాలపై అధికారులు పలు షాకింగ్ నిజాలు వెల్లడించారు. 8 నెలల్లోనే సైబర్‌ నేరగాళ్లు రూ. 633 కోట్లు దోచేశారని అన్నారు. గతేడాది జులై నుంచి 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు 35 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు సగటున రోజుకు రూ. 2.56 కోట్లు దోచేసినట్లు షాకింగ్ నిజాలు తెలిపారు. రూ. 1.46 కోట్లు రికవరీ చేశామని, రూ. 65.59 కోట్లు నిలిపివేసినట్లు వారు స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img