బీహార్ గోపాల్‌గంజ్ జిల్లా కుచాయికోట్ పోలీస్ స్టేషన్ బల్థారీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు శుక్రవారం ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. ఈ అంతర్జాతీయ ముఠాకు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కారులో ప్రయాణిస్తున్నారని, వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 8,774 సిమ్‌కార్డులు, నేపాలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నమని పోలీసులు తెలిపారు. నిందితులంతా ఖాట్మండుకు వెళ్తున్నారన్నారు.