Cyber Crime : అచ్చూ సినిమాలా.. 30నిమిషాల్లో 1.28 కోట్లు కొట్టేశారు
హైదరాబాద్‌లోని పేమెంట్ గేట్‌వే సంస్థ కార్యాలయపై సైబర్ నేరగాళ్లు దాడి(Cyber Crime)కి తెగబడ్డారు.
పూల్ ఖాతా నుంచి కేవలం అరగంట వ్యవధిలోనే రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు.
ఈ సొమ్మును 8 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకొన్నారు.
ఒడిశాకు చెందిన ఓ ఎలక్ట్రికల్ సంస్థ ద్వారా పేమెంట్ గేట్‌వేలో వర్తకుడిగా (మర్చంట్) రిజిస్ట్రేష న్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్‌తో సోమవారం రాత్రి సర్వర్‌లో సమస్యలను సృష్టించి ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
#CyberCrime #OnlineFraud : ఇలా చేస్తే మీ డబ్బులు సురక్షితం
నిందితులు మరింత డబ్బును కొట్టేసేందుకు ప్రయత్నించడంతో అలారం మోగిందని, మరుసటి రోజు సంస్థ ప్రతినిధులు ఖాతాలను ఆడిటింగ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
దీని పై పేమెంట్ గేట్‌వే సంస్థ సీఈవో ప్రభుకుమార్ గురువారం ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు కేసు దర్యాప్తు చేపట్టారు.
సైబర్ నేరగాళ్లు డబ్బు బదిలీ చేసుకొన్న 8 ఖాతాలన్నీ ఖాళీ అయినట్లు పోలీసులు గుర్తించారు.