Homeహైదరాబాద్latest Newsజగిత్యాల జిల్లాలో సైబర్ మోసం.. కస్టమర్ కేర్ అంటూ ఫోన్ చేసి నమ్మించి డబ్బు లూటీ

జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం.. కస్టమర్ కేర్ అంటూ ఫోన్ చేసి నమ్మించి డబ్బు లూటీ

ఇదేనిజం, ధర్మపురి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో సైబర్ మోసం జరిగింది. పెగడపల్లి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోమలకుంట గ్రామానికి చెందిన కొప్పుల రజిత అను ఆమెకి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని బాధితురాలని నమ్మపరిచి, ఓటీపీ చెప్పమని కోరారు. అట్టి మాటలు నమ్మిన బాధితురాలు సైబర్ మోసగాళ్లకు తెలుపగా నిమిషాల వ్యవధిలో ఆమె ఖాతా నుండి 1,06,100/-పోయినట్లు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండల ప్రజలు ఎవరు గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా కాల్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితిలో వివరాలు తెలియ పరచకూడదని ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు.

Recent

- Advertisment -spot_img