Homeహైదరాబాద్latest Newsడిజిటల్‌ ‘అరెస్టు’ పేరిట సైబర్‌ దగా..! అస్సలు డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటంటే..?

డిజిటల్‌ ‘అరెస్టు’ పేరిట సైబర్‌ దగా..! అస్సలు డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటంటే..?

సాధారణంగా ఎవరైనా ఏదైనా నేరం చేస్తే పోలీసులు నేరుగా వచ్చి అరెస్ట్‌ చేస్తారు. కానీ ఇక్కడ సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో అరెస్ట్‌ చేస్తారు. సైబర్‌ నేరగాళ్లు మీకు ఒక వీడియో కాల్‌ చేస్తారు. తాము పోలీసులమని, దర్యాప్తు అధికారులమని నమ్మిస్తారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటి వాటిని మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఒక స్క్రీన్‌ ముందు నిర్బంధించి దోచుకోవడాన్నే ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అంటారు.

డిజిటల్‌ ‘అరెస్టు’ పేరిట సైబర్‌ దగా
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వీడియోకాల్స్‌లో నకిలీ పోలీసుస్టేషన్‌ను చూపించి ఓ వైద్యుడి నుంచి రూ.2 కోట్లు దోచేశారు. ఏకంగా కోర్టు హాల్‌ సెట్‌ వేసి వర్ధమాన్‌ గ్రూపు సంస్థల సీఎండీ ఎస్‌పీ ఓస్వాల్‌‌ నుంచి రూ.7 కోట్లు కాజేశారు. ‘మీపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది’ అని నమ్మించారు. నిజమేనని నమ్మిన ఆ వైద్యురాలు తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము దాదాపు రూ.85 లక్షలు సైబర్‌ నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు వేశారు.

Recent

- Advertisment -spot_img