If the train ticket is canceled, Rs 8 lakh is lost. He hit millions in five minutes by doing on the phone what a cyber criminal would do.
A government employee has lodged a complaint with the Rachakonda Cyber Crime Police alleging fraud.
రైలు టికెట్ రద్దు చేసుకుంటే రూ.8 లక్షలు పోయాయి. సైబర్ నేరగాడు చేయమన్నట్లు ఫోన్‌లో చేయడంతో ఐదు నిమిషాల్లో లక్షలు కొట్టేశాడు.
మోసం చేశాడంటూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు.
ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల ఇతర రాష్ర్టానికి వెళ్లేందుకు ixgo యాప్‌లో రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు.
ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు.
అయితే టికెట్ రద్దు చేసుకున్నా డబ్బులు వాపస్ రాకపోవడంతో అతను యాప్‌నకు సంబంధించిన కస్టమర్ కేర్ నం. కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు.
అందులో దొరికిన నంబరుకు ఫోన్ చేశాడు. అయితే అతను ఎత్తలేదు.
కొద్ది సేపటి తర్వాత ఫోన్ చేసిన నంబరు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ixgo యాప్ కస్టమర్‌కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీకు ఏం సహాయం చేయగలను అని అడిగాడు.
ప్రభుత్వ ఉద్యోగి తాను రైలు టికెట్ రద్దు చేసుకున్నా.. డబ్బు వాపస్ రాలేదని చెప్పాడు. అయితే మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. అయితే మీరు మీ ఫోన్‌లో ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆ తర్వాత రిమోట్ యాక్సిస్ ఐడీని చెప్పండి.. అని అడిగాడు.
ఇక బాధితుడి ఫోన్‌ను ప్రత్యక్షంగా చూస్తున్న గుర్తు తెలియని వ్యక్తి మీరు ఎస్‌బీఐ యోనో యాప్‌లో లాగిన్ అవ్వండని చెప్పి ఆ వివరాలతో అతను ప్రభుత్వ ఉద్యోగి ఖాతా నుంచి ఐదు నిమిషాల్లో రూ.8 లక్షలు కొల్లగొట్టాడు.
డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ప్రభుత్వ ఉద్యోగి షాక్‌కు గురయ్యాడు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.