Homeతెలంగాణడీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌.. వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు..!

డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌.. వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు..!

డీజీపీ రవిగుప్తా వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్‌కు కేటుగాళ్లు పాల్పడుతున్నారు. తెలంగాణ డీజీపీ పేరుతో ఓ వ్యాపారవేత్త కూతురికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. డ్రగ్స్ కేసు నుంచి బయటపడేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యాపారవేత్త సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో కాల్ వచ్చినట్లు.. ఇది పాకిస్తాన్ కోడ్ అని పోలీసులు గుర్తించారు. నిందితుల వాట్సాప్ డీపీకి డీజీపీ రవి గుప్తా ఫొటో పెట్టినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img