Homeహైదరాబాద్latest NewsCyclone: తుపాను.. పొంచి ఉన్న మరో ముప్పు.. ఏపీలో భారీ వర్ష సూచన..!

Cyclone: తుపాను.. పొంచి ఉన్న మరో ముప్పు.. ఏపీలో భారీ వర్ష సూచన..!

Cyclone: ఎండలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు త్వరలో ఊరట లభించనుంది. అరేబియా సముద్రంలో తుపాను తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో, జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఐఎండీ హెచ్చరికల ప్రకారం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, తీర ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రోడ్లు, వ్యవసాయ భూములు, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img