Homeహైదరాబాద్latest Newsఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను.. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను.. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మరో తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీ.. తాజాగా పొంచి ఉన్న తీపానుతో అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. టోల్ ఫ్రీ నంబర్లు, పునరావాస కేంద్రాలు, సహాయక చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14 నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ నెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం 14న వాయుగుండంగా మారి 15న తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 15న తమిళనాడు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు: అత్యవసర సహాయ చర్యల కోసం విపత్తు నిర్వహణ నియంత్రణ గది టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img