ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మిచాంగ్ తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి వాతావరణ శాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ప్రకటించారు. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో తమిళనాడుకు కూడా ముప్పు పొంచి ఉంది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఇచ్చారు. కంట్రోల్ రూం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.