Homeహైదరాబాద్latest Newsఅంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దళపతి విజయ్‌ కౌంటర్

అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దళపతి విజయ్‌ కౌంటర్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో తమిళ నటుడు, తమిళనాట వెట్రి కళగం పార్టీ నేత విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కొంతమందికి అంబేద్కర్ పేరు వినడం ఇష్టం ఉండదు. భారతదేశ పౌరులందరిలో స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. అట్టడుగు వర్గాలకు ఆయన ఆశాజ్యోతి అని పేర్కొన్నారు. అంబేడ్కర్.. అంబేడ్కర్.. పేరు చెబితే మనసు, పెదవులు ఆనందంగా ఉంటాయి’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే దళపతి విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. పార్టీ తొలి ర్యాలీలో బాబా సాహెబ్ అంబేద్కర్, పెరియార్ ఈవీ రామస్వామి, కె.విజయ్ మాట్లాడుతూ కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. మరోవైపు విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img