ఇదేనిజం, కోదాడ: నష్టపోయిన రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని కాగిత రామచంద్రపురం, నాయకని గూడెం గ్రామాల నుండి వెళ్లి సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. అయితే గండిపడ్డ కాల్వను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ ఎడమ కాల్వ ను సందర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నష్టపోయిన వేల ఎకరాల రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. అనంతరం నష్టం వాటిల్లిన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను, రైతులను, ధైర్యం చెప్పింది బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోలేక ప్రెజర్ కు కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారు అని తెలిపారు. పంట కొట్టుకుపోయిన పొలాలకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదని తెలిపారు.
సీఎం రేవంత్ తన తప్పు కప్పు పుచ్చుకునే క్రమంలో మాపై నిందలు మోపడం విడ్డూరమని అన్నారు. ముఖ్యమంత్రికి చావుకు, పెళ్ళికి తేడా తెలవడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి హవాభావాలు చూస్తుంటే ఖమ్మంలో సంబరాలకు వచ్చినట్టు ఉందని అన్నారు. పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలు చేస్తున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం సృష్టించిన ప్రకృతి విలయం అని అన్నారు. అంత అయిపోయాక కాంగ్రెస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు.