దమ్మాయిగూడ, ఇదే నిజం: దమ్మాయిగూడ ప్రజలు పడుతున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి అహర్నిషలు కృషి చేస్తామని మున్సిపల్ బీజేపి ప్రెసిడెంట్ నాగమల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, వార్డు కౌన్సిలర్ లు సందర్శించి నీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, రోడ్లు తదితర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడానికి అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరుకు కృషి చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రధాన సమస్యగా ఉన్న నీటి సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా అధ్యక్షులు శాంతి, ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాపిరెడ్డి, కాలనీ సభ్యులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.