Homeహైదరాబాద్కారు దిగి.. కమలం జండా కప్పుకున్నారు..

కారు దిగి.. కమలం జండా కప్పుకున్నారు..

దమ్మాయిగూడ, ఇదే నిజం: టీఆర్​ఎస్​ పార్టీ నిరంకుష పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్​ రెడ్డి అన్నారు. మేడ్చల్​ డిస్ట్రిక్, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 30 మంది యువకులు, టీఆరెస్ పార్టీ అర్జీకే కాలనీ బీసీ మోర్చా నాయకులు కొక్కుల భిక్షపతి, శ్రవణ్ లు మంగళవారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు మొర నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ బీజేపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొంపల్లి మోహన్​ రెడ్డి, నాగమల్లారెడ్డిలు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా అధ్యక్షులు శాంతిరెడ్డి, మున్సిపాలిటీ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు మనుపటి శ్రీనివాస్, బింగి రమేష్ గౌడ్, మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి గుజ్జుక నర్మద పరుశురాం, ఉపాధ్యక్షులు బలరాం సింగ్, యూత్ నాయకులు కర్ర శ్రీనివాస్ గౌడ్, మహిళ నేత శోభ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img