Homeహైదరాబాద్latest Newsదానం నాగేందర్ మళ్లీ బీఆర్ఎస్ లోకి..?

దానం నాగేందర్ మళ్లీ బీఆర్ఎస్ లోకి..?

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫార్ములా-ఈ కారు రేసు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసు సంభందించి విచారణ జరుగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే దీనిపై కేటీఆర్ మాత్రం నా తప్పేమి లేదు.. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకోచ్చామని అంటున్నరు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో కేటీఆర్‌ ను ఎలాగైనా ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారు. అలాగే ఇటు బీఆర్‌ఎస్‌ వర్గాలు, అటు కాంగ్రెస్ వర్గాలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు అప్పట్లోనే గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం అని ఆయన అన్నారు. అలాగే నేడు కేసీఆర్ గురించి కూడా ఆసక్తికర వ్వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ భోళా శంకరుడు, చాలా మంచి మనిషి, అద్భుతమైన నాయకుడు అని ప్రశంశలు కురిపించాడు. దీంతో దానం నాగేందర్ మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లనున్నట్లు రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కి అలజడి మొదలయ్యిది. ఎందుకంటే దానం బీఆర్ఎస్ లోకి వెళ్తే ఆయన తో పాటు వచ్చిన 9 మంది ఎమ్మెల్యే లు కూడా బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img