Homeహైదరాబాద్latest NewsJanasena కు డేంజర్​ బెల్స్​.. ఎక్కువ ప్రమాదం సింబల్​తోనేనా

Janasena కు డేంజర్​ బెల్స్​.. ఎక్కువ ప్రమాదం సింబల్​తోనేనా

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పొత్తులు-ఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా జనసేన – టీడీపీ అడుగులేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ముంగిట్లో జనసేనకు మళ్లీ సింబల్‌ కిరికిరి ఎదురైంది. గాజు గ్లాస్‌ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జనసేన కన్నా ముందే తాము గాజుగ్లాసు గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టును ఆశ్రయించారు రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు. 2023 డిసెంబర్‌ 20న గాజు గ్లాస్ గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.. స్పందించిన ఈసీ గాజుగ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img