హైదరాబాద్‌లో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గత 72 గంటల్లో సిటీలో గాలి నాణ్యత క్షీణించింది. టపాసులు భారీగా కాల్చడంతో కాలుష్యం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10శాతం కాలుష్యం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 171గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయిందన్నారు. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్ నగర్ అధికంగా వాయు కాలుష్యం పెరిగిందని చెప్పారు.