Dark Web: డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్‌లోని భాగం. దీనిని సాధారణ సెర్చ్ ఇంజన్‌లను ఉపయోగించి చేరుకోలేం. ఇది సెర్చ్ ఇంజన్లలో ఇండెక్స్ అవ్వని డీప్‌వెబ్‌లో ఒక భాగం. డార్క్‌వెబ్‌ను యాక్సెస్ చేయడానికి ప్రత్యేక బ్రౌజర్ అవసరం. ఇక్కడ యూజర్ తన గుర్తింపు, లొకేషన్‌ను వెల్లడించాల్సిన అవసరం లేదు. దీని కారణంగా నేరస్థులు తరచుగా దీన్ని ఉపయోగిస్తారు. వ్యక్తిగత సమాచారం, ఆయుధాల కొనుగోలు, అమ్మకం ప్రతిదానికీ ఇది ఉపయోగపడుతుంది.