Homeహైదరాబాద్latest Newsసోషల్ మీడియాలో డార్లింగ్ రచ్చ.. కొట్టుకుంటున్న హీరో హీరోయిన్లు

సోషల్ మీడియాలో డార్లింగ్ రచ్చ.. కొట్టుకుంటున్న హీరో హీరోయిన్లు

నభా నటేష్, ప్రియదర్శి, రీతూ వర్మల మధ్య డార్లింగ్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. ప్రభాస్ డార్లింగ్ మాటల మీద నభా నటేష్ ఫన్నీగా రీల్ చేసింది. ఇక ఈ వీడియో మీద స్పందిస్తూ.. డార్లింగ్ అదరగొట్టేశావ్ అంటూ ప్రియదర్శి స్పందించాడు. ఏయ్ మిస్టర్.. మాట్లాడేముందు జాగ్రత్త.. డార్లింగ్ అని తెలియనివాళ్లని పిలిస్తే శిక్షార్హం అంటూ కౌంటర్ వేసింది. అవునా? నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివి అయ్యావ్ అంటూ ప్రియదర్శి ట్వీట్ వేశాడు. ఇలా ఎందుకు వై దిస్ కొలవరీ అంటూ ఫన్నీగా ప్రియదర్శి ట్వీట్ వేశాడు.

ఇక రీతూ వర్మ గత పోస్టుల్లోకి వచ్చి హాయ్ డార్లింగ్.. అద్భుతంగా ఉన్నావ్ అంటూ ప్రియదర్శి కామెంట్ పెట్టాడు. అగో మళ్లీ డార్లింగ్ అంటున్నాడు అని నభా నటేష్ వెంటనే ప్రియదర్శి కామెంట్‌కు కౌంటర్ వేసింది. దీంతో రీతూ వర్మ రంగంలోకి దిగింది. నా పోస్ట్ కింది మీ కామెంట్ల గోల ఏంటి? అని ఫైర్ అయింది. ఇలా ఈ ముగ్గురి సంభాషణలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇది గోల కాదు డార్లింగ్.. నీ మీదున్న ఆరాధన.. నువ్వే నభాకి చెప్పు అంటూ ప్రియదర్శి మళ్లీ రీతూ వర్మకు కామెంట్ పెట్టాడు. ఇలా ప్రియదర్శి పెడుతున్న కామెంట్లలో అయితే వై దిస్ కొలవరీ? అనే పదం కనిపిస్తోంది. ఇది సినిమా ప్రమోషన్ అని చూస్తేనే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ, నభా, ప్రియదర్శి కలిసి నటిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ప్రియదర్శి, నభా, రీతూ వర్మలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img