Homeక్రైంప్రియుడి ఇంటి ముందు నిరసన

ప్రియుడి ఇంటి ముందు నిరసన

ఇదేనిజం, ఖమ్మం: ప్రేమిస్తున్నాని చెప్పి శారీరకంగా లోబర్చుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు ఓ యువతి నిరసనకు దిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని అదే ప్రాంతానికి చెందిన బీసీ వర్గంలోని గోపాలకృష్ణ అనే యువకుడు ఇన్‌ స్టాగ్రాం ద్వారా పరిచయం చేసుకున్నాడు. వారి మధ్య ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. దీంతో ఆ యువకుడి మాటలు నమ్మి మోసపోయింది. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట కూర్చుని మౌన పోరాటానికి దిగింది.

Recent

- Advertisment -spot_img