Homeహైదరాబాద్latest Newsడేవిడ్ వార్నర్ కీలక నిర్ణయం

డేవిడ్ వార్నర్ కీలక నిర్ణయం

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బిజిటిలో ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. వార్నర్ రిటైర్మెంట్ తో ఆసీస్ ఓపెనర్ సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ మళ్లీ మైదానంలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నాడు.కోడ్ స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన వార్నర్, దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పాడు. సెలక్టర్ల నుంచి ఫోన్ రావడమే ఆలస్యం అని ప్రకటించాడు.

Recent

- Advertisment -spot_img