Homeస్పోర్ట్స్David Warner : వార్నర్‌కు అనుమతినివ్వని ఫ్రాంఛైజీ..

David Warner : వార్నర్‌కు అనుమతినివ్వని ఫ్రాంఛైజీ..

David Warner Wasn’t Allowed To Travel With Team : వార్నర్‌కు అనుమతినివ్వని ఫ్రాంఛైజీ..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కు ఈ సీజన్‌ అస్సలు కలిసి రాలేదు. 

ఐపీఎల్‌-2021 తొలి దశలో భాగంగా వరుస వైఫల్యాలు వెంటాడటంతో యాజమాన్యం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

అంతేగాక.. ఫేజ్‌-1లో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో తుదిజట్టులో కూడా అతడికి చోటు దక్కలేదు.

ఇక యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో భాగంగా వార్నర్‌కు అవకాశం దక్కినా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.

దీంతో.. మరోసారి అతడిని పక్కనపెట్టారు.

ఈ క్రమంలో ఇటీవలి రాజస్తాన్‌ మ్యాచ్‌తో వార్నర్‌ హోటల్‌కే పరిమితమయ్యాడు.

ఇక గురువారం నాటి చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా అతడు డగౌట్‌లో కనిపించలేదు.

ఈ నేపథ్యంలో… జట్టుతో ప్రయాణించడానికి కూడా వీల్లేదని ఫ్రాంఛైజీ వార్నర్‌కు చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముఫద్దల్‌ వొహ్రా అనే ట్విటర్‌ యూజర్‌.. ప్రముఖ జర్నలిస్టును ఈ విషయం గురించి అడిగానని, జట్టుతో ప్రయాణించడానికి ఫ్రాంఛైజీ వార్నర్‌ను అనుమతించడం లేదని ఆయన చెప్పినట్లు పేర్కొన్నడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీంతో.. ”జట్టును టైటిల్‌ విజేతగా నిలిపిన లెజెండ్‌కు ఇంతటి అవమానమా? ఆర్సీబీ, సీఎస్‌కే యాజమాన్యాన్ని చూసి కెప్టెన్లను ఎలా గౌరవించాలో తెలుసుకోండి?” అని వార్నర్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం.. పబ్లిసిటీ కోసం అనవసరంగా అసత్యాలు ప్రచారం చేయొద్దని, వివిధ కారణాల వల్ల జట్టుతో ప్రయాణించేందుకు ఆటగాళ్లకు అనుమతి ఉండదు కదా అని ఫ్రాంఛైజీకి మద్దతుగా నిలుస్తున్నారు.

ఏదేమైనా.. మళ్లీ సన్‌రైజర్స్‌ జట్టుతో కనిపించకోవచ్చని వార్నర్‌ హింట్‌ ఇచ్చిన నేపథ్యంలో… ఆర్సీబీ కాబోయే తదుపరి కెప్టెన్‌ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img