తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని కారణంగా ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.