DC vs LSG : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో మొదటి బ్యాటింగ్ చేయనుంది. ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్ ఉన్నారు. లక్నో జట్టులో అర్షిన్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్, సిద్ధార్థ్ ఉన్నారు.