ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్
ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో 15 రోజుల పాటు సాగిన జిల్లా అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా అర్మడ్ సిబ్బంది నుండి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. 03 ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్‌కు అడ్మిన్ ఆర్ఐ పెద్దన్న ప్లటూన్ కమాండెర్‌గా వ్యవహరించారు. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్, ఔట్‌డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్‌లలో సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మట్లాడుతూ.. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని అన్నారు. అద్బుతంగా చేసిన పరేడ్‌ను చూస్తే తమ శిక్షణ రోజులు గుర్తొస్తున్నాయని తెలిపారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడం, శాంతి భద్రతను పరిరక్షించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర రావు, అడ్మిన్ ఆర్ఐ పెద్దన్న, ఎంటీఓ ఆర్‌ఐ అంజన్న, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.