Homeజిల్లా వార్తలుముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు రద్దు.. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు...

ముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు రద్దు.. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ

ఇదే నిజం : ముస్తాబాద్ లో ఉన్న మహర్షి హై స్కూల్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముస్తాబాద్ మండల విద్యాశాఖ అధికారి అందించిన నివేదిక ప్రకారం నర్సరీ చదువుతున్న చిన్నారి మనోజ్ఞ,తండ్రి పేరు భూమయ్య ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు టైర్ కిందపడి అక్కడికక్కడే మరణించిందని, ఈ సంఘటన స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్, మహర్షి హై స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యపు వైఖరి కారణంగా జరిగిందని తేలింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, పి.డబ్ల్రూ.డి శాఖ నుంచి భవన స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉండాలని, మహర్షి హై స్కూల్ మేనేజ్మెంట్ పేర్కొన్న సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అన్నారు.
పాఠశాల వాహనం పార్కింగ్ , మెయింటెనెన్స్ అంశంలో రవాణా శాఖ జారీ చేసిన మెమోలోని సూచనలు , మార్గదర్శకాలను మహర్షి హై స్కూల్ యాజమాన్యం పాటించలేదని, పిల్లల రవాణా సమయంలో స్కూలు యాజమాన్యం పాటించాల్సిన జాగ్రత్తలు సైతం పాటించడంలో వైఫల్యం చెందారని, దీని కారణంగా ఒక పసి ప్రాణం చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.మహర్షి హై స్కూల్ కు సరైన బిల్డింగ్ అనుమతులు సర్టిఫికెట్ లేవని , రవాణా సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని, పాఠశాలలోని పిల్లలకు సిబ్బంది ప్రాణాలకు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img