Homeహైదరాబాద్latest Newsనాణ్యత ప్రమాణాలను పాటించని సెయింట్ ఆంటోనీస్ పాఠశాల గుర్తింపు రద్దు చేయండ: విద్యార్థి నాయకులు

నాణ్యత ప్రమాణాలను పాటించని సెయింట్ ఆంటోనీస్ పాఠశాల గుర్తింపు రద్దు చేయండ: విద్యార్థి నాయకులు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: నాణ్యత ప్రమాణాలను పాటించకుండా సుచిత్ర త్రీ టెంపుల్స్ దగ్గర గల సెయింట్ ఆంటోనీ స్కూల్ ను నిర్వహిస్తున్న యాజమాన్యంపై తగు చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు గొల్లజాన్ , నవీన్ యాదవులు డిమాండ్ చేశారు. గురువారం స్కూల్ యాజమాన్యం వసూలు చేస్తున్న ఫీజుల దోపిడి, బస్సుల నాణ్యత, స్కూల్ బుక్స్ పై అధిక వసూళ్లు, బిల్డింగ్ నాణ్యత తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం గొల్ల జాన్, నవీన్ యాదవులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా సెయింట్ ఆంటోనీస్ యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పాఠశాల పుస్తకాలలో సైతం విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. కాల పరిమితి దాటిన భవనంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారని విమర్శించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ ధాన్యతపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాన రహదారికి అనుకుని ఉండటం వల్ల ఈ పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. పాఠశాల పర్మిషన్ ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకుంటే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపదతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రెడ్డి , భరత్ రెడ్డి ,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img