కోల్‌కతాలో ట్యూషన్ కు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైంది. మరుసటి రోజు ఆమె మృతదేహం కాలువలో కనిపించింది. పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో జరిగింది. మహిషామరి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతోంది. శుక్రవారం ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా అదృశ్యమైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మహిషామరి పోలీస్ క్యాంపుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే జయనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. కాగా, శనివారం తెల్లవారుజామున కాల్వలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో 19 ఏళ్ల ముస్తాకీన్ సర్దార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.