మెదక్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉసిరికపల్లి వద్ద కారులో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.రోడ్డు ప్రమాదంలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులు పాముబండ తండా, రత్నాపూర్‌తో పాటు తాళ్లపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది.