HomeజాతీయంTerrorism : వారణాసి బాంబు పేలుళ్ల కేసు నిందితుడు వలీ ఉల్లా ఖాన్‌కు మరణశిక్ష

Terrorism : వారణాసి బాంబు పేలుళ్ల కేసు నిందితుడు వలీ ఉల్లా ఖాన్‌కు మరణశిక్ష

Terrorism : వారణాసి బాంబు పేలుళ్ల కేసు నిందితుడు వలీ ఉల్లా ఖాన్‌కు మరణశిక్ష

Terrorism : వారణాసిలో 2006లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల దోషిగా తేలిన సూత్రధారి వలీ ఉల్లా ఖాన్‌కు ఘజియాబాద్ కోర్టు నిన్న మరణ శిక్ష ఖరారు చేసింది.

నాటి బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.

ఈ మూడింటిలో ఓ కేసులో వలీ ఉల్లా ఖాన్‌కు మరణశిక్ష విధించిన కోర్టు.. హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది.

అయితే, అతడిపై మోపిన మూడో కేసులో బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

అప్పట్లో అతడి తరపున వాదించేందుకు వారణాసికి చెందిన న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ కేసును ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ హైకోర్టు బదిలీ చేసింది.

ఇప్పుడిదే కోర్టు ఖాన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Recent

- Advertisment -spot_img