Homeహైదరాబాద్latest Newsడిండి లో రుణమాఫీ సంబరాలు

డిండి లో రుణమాఫీ సంబరాలు

ఇదే నిజం దేవరకొండ: డిండి మండల కేంద్రంలో శుక్రవారం నాడు రైతు రుణమాఫీ సంబరాలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెైతులు నిర్వహించిన ఎడ్ల బండి ట్రాక్టర్లు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, రుణమాఫీ మొత్తం రూ 31వేల కోట్లు కట్ ఆఫ్ తేదీ : 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి చేశామని గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు రుణమాఫీ చేస్తాం అని చెప్పి అందరినీ మోసం చేశారని రుణమాఫీ చేయడంలో గత ప్రభుత్వం విఫలమైంది అంటున్న రైతన్నలు గత ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తెలంగాణలోని దేవుళ్ళ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసి తీరుతున్నాడు. ఈ రోజు తెలంగాణ రైతాంగానికి సంక్షేమ పాలన అందించే ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అని, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మరియు అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిండి మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దెల శ్రీను, మాజీ ఉపసర్పంచ్ నూకం వెంకటేష్, పున్న దినేష్, వెంకటేష్, లక్ష్మణ్ నరేష్, సాయి, శ్రీనివాస్ గౌడ్, గుర్రం రాములు, సాలయ్య, వెంకటయ్య, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img