HomeసినిమాDecide your destination మీ Destination ​ను డిసైడ్​ చేసుకోండి

Decide your destination మీ Destination ​ను డిసైడ్​ చేసుకోండి

స్టార్ హీరోయిన్​గా పలు భాషల సినిమాల్లో ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకుని వాటిని సక్సెస్​లుగా మలుచుకుంటున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. పుష్ప మూవీలోని శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్​ను​ సంపాదించుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్​ ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే రష్మిక తరచూ పోస్టులు పెడుతూ తన సినిమా అప్ డేట్స్​తో పాటు పర్సనల్స్ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇటీవల కాలంలో షూటింగ్స్ ఎక్కువ ఉండడం వలన ట్రావెలింగ్​ను తాను ఎంతో మిస్ అవుతున్నట్లు రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘ట్రావెలింగ్ చేసే వారికి ఒక చిన్న విషయం, ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే మీ ట్రావెలింగ్ డెస్టినేషన్​ను నిర్ణయించుకోండి. అది ఎక్కడికైనా సరే, మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి. ఒంటరిగా లేదా కుటుంబంతో ఎక్కడైనా ఏదైనా కానీ ప్రయాణం చేయండి. దాని వలన కొంత లోక జ్ఞానం తెలుస్తుంది, మరీ ముఖ్యంగా పలు ప్రాంతాల్లోని విభిన్న ఆహారాలు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలు వంటివి తెలుస్తాయి’ అంటూ రష్మిక పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img