తెలంగాణలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్‌లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.