Homeహైదరాబాద్latest Newsభారత్​లో క్షీణిస్తోన్న హిందువుల జనాభా.. 65 ఏళ్లలో 7.82% మేర తగ్గుదల

భారత్​లో క్షీణిస్తోన్న హిందువుల జనాభా.. 65 ఏళ్లలో 7.82% మేర తగ్గుదల

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో అత్యధికంగా హిందూ జనాభా ఉన్న భారతదేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నది. ఈ మేరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. 1950 నాటికి దేశంలో 84.68%గా ఉన్న హిందూ వర్గ ప్రజల వాటా 2015 నాటికి 78.06%కి తగ్గింది. దీని బట్టి చూస్తే గడిచిన 65 ఏళ్లలో 7.82% క్షీణించింది. మరోవైపు ఇదే సమయంలో ముస్లింల వాటా 9.84% నుంచి 14.09%కు పెరిగింది. అంటే ఆ వర్గ జనాభా 43.15% పెరిగింది. ఇకపోతే క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరగ్గా.. జైనులు, పార్శీల శాతం తగ్గింది. హిందువుల జనాభా క్రమంగా పడిపోవడంపై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విధాన, రాజకీయ, సామాజికపర కారణాలు..
హిందూ జనాభా తగ్గుతోన్న నేపథ్యంలో జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో ‘ఇద్దరు వద్దు–ఒక్కరు ముద్దు’ అనే భావనతో హిందువుల తమ జనాభాను తామే తగ్గించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉన్న హిందూ జనాభాలో మత మార్పిడిలు సైతం ఈ తగ్గుదలపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అత్యధిక రాజకీయ పార్టీలు కావొచ్చు, లేదా నాయకులు కావొచ్చు.. వారి వారి రాజకీయ భవిష్యత్తు కోసం మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, జనాభాపై సరైన ప్రణాళిక లేకపోవడం వంటివి కూడా ఇందుకు కారణాలు అయ్యే అవకాశం ఉంది. ముస్లిం వర్గంలో గరిష్ఠంగా 12 మందిని వివాహమాడే సంస్కృతి ఉండటం, దీంతో పిల్లల్ని కనే అంశంలో వారికి నియంత్రణ లేకపోవడం, దీనికి తోడు బంగ్లాదేశ్, మయన్మార్​ వంటి భారత సరిహద్దును పంచుకొనే దేశాల నుంచి వలస వచ్చే శరణార్థులు, రోహింగ్యాల సంఖ్య పెరగడం వంటివి ముస్లిం సామాజిక వర్గ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

హిందువుల్లో అభద్రతా భావం..
తమ జనాభా తగ్గపోతున్న నేపథ్యంలో యావత్​ హిందూ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. బలవంతపు మత మర్పిడులు, అక్రమ వలసలతో దేశంలో తమ వర్గం క్షీణిస్తోందని అభద్రతా భావాన్ని వెల్లడిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో మైనార్టీల జనాభా పెరిగి హిందువుపై తిరుగుబాటు బావుటా ఎగురవేయవచ్చని ఆందోళన చెందుతుంది. ఈ దేశాన్ని సెక్యులర్​గా ప్రకటించిన్పటికీ మొదటి నుంచీ భారత్​ హిందూ దేశమే. వాస్తవానికి విదేశీ అక్రమ వలసలను గుర్తించి వారిని వెనక్కి పంపేందుకు విదేశీయుల చట్టం-1946లోని సెక్షన్‌ 3(2)(సి) అమల్లో ఉన్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభాత్వాలు దీనిని పాటించట్లేదు. మరో పక్క చాపకింద నీరులా మత మార్పిడిలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్​19(1) ఏ ప్రకారం ఈ దేశంలో ఏ మత ప్రచారమైనా సక్రమమే అని, వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోరాదని మైనారిటీ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో ఏ విధమైన జనాభా కట్టడి కట్టుదిట్టంగా లేకపోవడంతో తమ మనుగడపై తమకే అభయం లేకుండా పోతోందని హిందూ సమాజం భయాందోళన వక్తం చేస్తోంది.

పొరుగు దేశాల్లో ఇదీ పరిస్థితి..
దక్షిణాసియాలోని బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల్లో మెజార్టీ మతస్థుల వాటా పెరుగుతోంది. వాటిలో మైనార్టీల వాటా మాత్రం మరింత తగ్గుతోంది. మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లోనూ మెజార్టీ వర్గం ప్రజల వాటా పెరిగింది. మాల్దీవుల్లో మెజార్టీ వర్గంగా ఉన్న షఫీ సున్నీల వాటా 1.47% తగ్గగా.. బంగ్లాదేశ్‌లో మెజార్టీ మతస్థుల వాటా మాత్రం18% అధికంగా నమోదైంది. భారత ఉపఖండంలో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. పాకిస్థాన్‌లో మెజార్టీ వర్గమైన హనాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగ్గా.. మొత్తంగా ఆ దేశ జనాభాలో ముస్లింల వాటాలో 10% పెరుగుదల నమోదైంది. ముస్లిమేతరులు మెజార్టీ వర్గాలుగా ఉన్న దేశాల్లో.. మయన్మార్‌, భారత్‌, నేపాల్‌లలో మెజార్టీ మతస్థుల వాటా తగ్గడం ఆందోళనకరంగా మారింది.

Recent

- Advertisment -spot_img