Homeజాతీయంతగ్గనున్న బైక్స్ రేట్లు

తగ్గనున్న బైక్స్ రేట్లు

న్యూఢిల్లీ: మోటార్ బైక్స్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII)తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు స్పష్టత నిచ్చారు. ప్రస్తుతం టూ-వీలర్ల పైన అత్యధికంగా 28 శాతం పన్ను రేటు ఉంది. దీన్ని 18 శాతానికి తగ్గించే అవకాశం ఉందని మంత్రి సూచించారు. జీఎస్టీ రేట్ల సవరణ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయన్నారు. టూవీలర్లపై ఎక్కువ జీఎస్టీ రేటు సరికాదని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. 150 సీసీ బైక్స్ పై ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని, ఆ తర్వాత దశలవారీగా ఆయా విభాగాలపై జీఎస్టీలో కోత విధించాలని గత కొన్నాళ్లుగా వాహన పరిశ్రమలు కోరుతున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img