మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వసంత్ బల్వంత్‌రావు చవాన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన 2009లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి నైగావ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అదే స్థానంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.